భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో 1994 కొత్త కేసులు.. 

భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో 1994 కొత్త కేసులు.. 

ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.  నార్త్ ఇండియాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.  కరోనా నుంచి బయటపడేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.  ప్రజలు కూడా దీనికి సహకరిస్తున్నారు.  అయితే, కరోనా మాత్రం కట్టడి కావడం లేదు.  కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది.  

తాజాగా కేంద్రం హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసింది.  ఇండియాలో గత 24 గంటల్లో 1994 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్రం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నది.  కొత్తగా 47 మరణాలు సంభవించినట్టు తెలిపింది.  ఇప్పటి వరకు దేశంలో మొత్తం 26,496 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం పేర్కొన్నది.  అలానే కరోనా వలన 824 మంది మరణించినట్టు కేంద్రం హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నది.  ఇక మొత్తంగా 5,803 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టుగా కేంద్రం తెలియజేసింది.