భారత్ పై పాక్ ప్రధాని తీవ్ర విమర్శలు..!

 భారత్ పై పాక్ ప్రధాని తీవ్ర విమర్శలు..!

భారత్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర విమర్శలు చేసారు. ఇటీవల భారత్ 25వేల మంది కాశ్మీరీ ప్రజలకు స్థిర నివాస సర్టిఫికెట్లను ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. జమ్మూ కశ్మీర్ ను భారత్ తన అనుబంధ భూభాగంగా చూపించే ప్రయత్నం చేయడం తొలి తప్పయితే, అక్కడి ప్రజలకు స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు (డొమిసైల్ సర్టిఫికెట్లు) ఇవ్వడం మరో తప్పు అన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా భారత్ జమ్మూ కశ్మీర్ జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా తమకు చెందాల్సిన భూభాగం పై భారత్ పెత్తనమేంటని విమర్శించారు. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను, నాల్గవ జెనీవా ఒడంబడిక సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు. ఈ విషయమై తాము ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ ను సంప్రదించామన్నారు. ఈ విషయమై ప్రపంచ దేశాల నేతలను సైతం కలుస్తున్నామన్నారు. భారత్ చర్యలతో దక్షిణాసియాలో శాంతి భద్రతలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ట్వీట్ చేశారు. కాశ్మీరీ ప్రజల హక్కులను లాక్కునే చర్యలను మానుకోవాలని అన్నారు.