అదిరిపోయే ధరలకు ఇస్తాం..

అదిరిపోయే ధరలకు ఇస్తాం..

భారతీయ ఫర్నిచర్ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమైంది స్వీడిష్ ఫర్నిషింగ్ దిగ్గజం ఐకెఈఏ.. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరలకు అందించే ఈ కంపెనీకి స్వీడన్‌తో పాటు యూరప్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ చూపు భారత్‌పై పడింది. 49.5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న భారతీయ ఫర్నిచర్ ఇండస్ట్రీలో అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఐకెఈఏ సన్నాహాలు మొదలెట్టింది. దీనిలో భాగంగా భారత్‌లో స్టోర్ ప్రారంభించాలని కంపెనీ భావించింది. ఈ కంపెనీ తొలి స్టోర్‌కు హైదరాబాద్ కేంద్రంకానుంది. భారతీయ మార్కెట్లతో పోలిస్తే కాస్తంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను విక్రయించాలని..ఐకెఈఏ నిర్ణయించింది. మొత్తం ఉత్పత్తుల్లో 15 శాతం ప్రొడక్ట్స్ రూ.1000 నుంచి రూ.200 అంతకన్నా తక్కువకే విక్రయించనుంది. ఇదే గనుక జరిగితే.. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంతటి సంచలనం కలిగించిందో.. ఫర్నిచర్ రంగంలో ఐకెఈఏ అంతటి సంచలనాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ జూలైలో హైదరాబాద్‌లో తొలి స్టోర్ తెరిచి.. అనంతరం 2019 నాటికి ముంబైలో రెండో స్టోర్ ప్రారంభించే అవకాశం ఉంది. భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్‌కు అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఔట్ లెట్లతో పాటు ఆన్‌లైన్ మార్కెట్లను ఐకెఈఏ వినియోగించుకునే అవకాశం ఉంది.