వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ లో మన ఐఐటీలు  

వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ లో మన ఐఐటీలు  

వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ 200 జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐఎస్‌ బెంగళూర్‌, ఐఐటీ ఢిల్లీలు స్థానం సంపాదించుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే... టాప్‌ 1000 వర్సిటీల జాబితాలో భారత యూనివర్సిటీల సంఖ్య 20 నుంచి 24కు పెరిగింది. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2019లో జాబితాలో ఐఐటీ బాంబే 162వ ర్యాంక్‌లో నిలిచి దేశంలోనే టాప్‌ ఇనిస్టిట్యూట్ స్థానాన్ని దక్కించుకుంది. 

అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ 172వ స్ధాన... ఐఐఎస్ బెంగళూర్‌ 170వ ర్యాంక్‌ ను కైవసం చేసుకుంది. ఈ ర్యాంకింగ్ కు ప్రపంచస్థాయిలో మంచి పాపులారిటీ ఉంది. 15వ సారి ప్రకటించిన ఈ ర్యాంకింగ్ లలో వరుసగా ఏడవ సంవత్సరం సైతం మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ టాప్‌ యూనివర్సిటీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన ప్రముఖమైన 1000 విశ్వవిద్యాలయాల ర్యాంకులను క్యూయస్ వరల్డ్ యూనివర్సిటీ జాబితా రూపంలో  వెల్లడించింది. ఇందులో భారత్‌ నుంచి 24 యూనివర్సిటీలు స్థానం దక్కించుకోగా... ఏడు వర్సిటీలు తమ ర్యాంకును మెరుగుపరుచకున్నాయి.