భారత్‌లో ఇదే టాప్ యూనివర్శిటీ...!

భారత్‌లో ఇదే టాప్ యూనివర్శిటీ...!

భారత్‌లోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) ఎంపికైంది. అయితే బెస్ట్‌ కళాశాలగా ఢిల్లీలోని మిరండా హౌస్‌ నిలిచింది. నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) పేరుతో ఇందుకు సంబంధించిన లిస్ట్ ను మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రిలీజ్ చేశారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌, కళాశాలలు, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌, వివిధ కేటగిరీల కింద ఈ లిస్ట్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. కాగా బోధన, నేర్చుకోవడం, సదుపాయాలు, రీసెర్చ్‌, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని బయటకు వచ్చే విద్యార్థులతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని సహజంగా ఈ జాబితాను రూపొందిస్తారు. అత్యుత్తమ విశ్వవిద్యాలయం విభాగంలో బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ యూనివర్శిటీ తర్వాత స్థానంలో ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బాంబే నిలిచాయి. ఉత్తమ వైద్య కళాశాలగా ఎయిమ్స్‌ నిలవగా.. ఎన్‌ఎస్‌ఎస్‌ఐయూ బెస్ట్‌ న్యాయకళాశాలగా ఎంపికైంది.