రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు

రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు

హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని సంస్కృతి ఆడిటోరియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఆదివారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ విందులో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహరెడ్డి.. సీఎస్ ఎస్‌కే జోషి.. స్పీకర్ మధుసూదనాచారి.. ఎంపీలు మల్లారెడ్డి, వినోద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ... రంజాన్‌ పండగ సోదర భావాన్ని పంచుతుందన్నారు. అందరి జీవితాల్లో సంతోషాలు నిండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్‌ వింద్‌లో పాల్గొన్నారు.