రైలు ఎక్కిదిగేటప్పుడు జరిగే ప్రమదాలకు పరిహారం

రైలు ఎక్కిదిగేటప్పుడు జరిగే ప్రమదాలకు పరిహారం

రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు ప్రయాణికులు ప్రమాదాలకు గురవడం సహజం. ఇటువంటి ప్రమాదాల్లో కొన్నిసార్లు చిన్నచిన్న గాయాలైతే.. మరొకొన్ని సార్లు ప్రాణాలే పొతుంటాయి. ప్రయాణికుడి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ రైల్వే అధికారులు తప్పించుకుంటూ ఉంటారు. కానీ.. ఇకపై అలా కుదరదు.   రైలు ఎక్కిదిగే క్రమంలో ఎప్పుడైనా మరణించినా లేదా గాయపడినా సదరు ప్రయాణికుడికి పరిహారం పొందే హక్కు కచ్చితంగా ఉందని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్‌  తీర్పు ఇచ్చారు. రైల్వే యాక్ట్ 1989 సెక్షన్ 124 ఎ ప్రకారం ప్రయాణికులు మరణించినా, గాయపడినా బాధితులకు నష్టపరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురయ్యే వ్యక్తి వద్ద రైలు టిక్కెట్‌ లేనంత మాత్రన పరిహారం పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.