ఐడియా నెట్‌వర్క్‌ కొత్త పేరిదే..

ఐడియా నెట్‌వర్క్‌ కొత్త పేరిదే..

టెలికాం దిగ్గజం ఐడియా పేరు మారుతోంది. ఐడియా, వొడాఫోన్‌ల విలీనం చివరి దశకు చేరుకోవడంతో వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా పేరు మార్చేందుకు జూన్‌ 26న ఐడియా సెల్యూలార్‌ ఈజీఎం నిర్వహించనుంది. ఈజీఎంను నిర్వహిస్తున్నట్టు ఐడియా సెల్యూలర్‌ శుక్రవారం తెలియజేసింది. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో దాదాపు రూ.15,000 కోట్ల నిధులు సమీకరణపై చర్చలు జరుపుతామని పేర్కొంది. ఈ టెలికాం దిగ్గజాల విలీనం అతిత్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.