నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల

నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల

నేడు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు టీఎస్ సీహెచ్‌ఈ చైర్మన్‌ పాపిరెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఐసెట్‌ ఫలితాలతో పాటు బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను ఉదయం 12 గంటలకు విడుదల చేయనున్నారు.