వెస్టిండీస్‌తో టీ20.. వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టు

వెస్టిండీస్‌తో టీ20.. వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టు

వెస్టిండీస్‌ టీ-20 మ్యాచ్ కోసం వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టును ప్రకటించింది ఐసీసీ. ఇంతకుముందే ఆయా దేశాల నుంచి తొమ్మిది మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఐసీసీ.. తాజాగా న్యూజిలాండ్‌ ఆటగాళ్లు లూక్‌ రోంచి, మిచెల్‌ మెక్లినగన్‌లను ఎంపిక చేసింది. ఈ వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ మే 31న లార్డ్స్‌లో జరగనుంది. గత సంవత్సరం హరికేన్‌ తుఫాన్ బీభత్సం చేయడంతో వెస్టిండీస్‌ స్టేడియాలు పూర్తిగా ధ్వంసం అయి.. తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ధ్వంసమైన స్టేడియాలను పునరుద్దరికరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ టి-20 మ్యాచ్ కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా కల్పించింది. భారత్‌ నుంచి ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌లు ఈ మ్యాచ్‌ ఆడనున్నారు. మరోవేపు కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ కెప్టెన్‌గా.. 13 మందితో కూడిన ఆటగాళ్లను వెస్టీండీస్‌ ఇప్పటికే ప్రకటించింది.