టెస్టు క్రికెట్‌లో 'టాస్‌' కొనసాగుతుంది

టెస్టు క్రికెట్‌లో 'టాస్‌' కొనసాగుతుంది

ఎప్పటిలాగానే టెస్టు క్రికెట్‌లో 'టాస్‌' కొనసాగనుంది. ఈ మేరకు అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ సిఫారసు చేసింది. గత కొంతకాలంగా టెస్టుల్లో టాస్‌ వేయకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే టెస్టు క్రికెట్‌లో టాస్‌ అంతర్గత భాగంగా క్రికెట్‌ కమిటీ భావించిందని ఐసీసీ తెలిపింది. ఇకపై సిరీస్‌ విజయానికి కాకుండా.. మ్యాచ్‌కు పాయింట్లు కేటాయించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. బాల్ టాంపరింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వాటికి పాల్పడే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. 2019 జులై నుంచి ప్రారంభంకానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా టాస్ కొనసాగనుంది. 

Photo: FileShot