టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ తుది నిర్ణయం అప్పుడేనా...?

టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ తుది నిర్ణయం అప్పుడేనా...?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రేపు మరో సమావేశం నిర్వహించనుంది. ఇంతక ముందు జరిగిన మూడు సమావేశాలలో, ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్లలో జరగనున్న టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఒక నిర్ణయాత్మక నిర్ణయానికి రాలేదు. అయితే రేపు జరగబోయే సమావేశంలో కూడా ప్రపంచ కప్ పై ఏ విధమైన నిర్ణయం తీసుకోదు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది టీ 20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే స్పష్టం చేసింది, కానీ ఐసీసీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాల ఆలస్యం చేస్తుంది. ఇక ఈ ప్రపంచ కప్ పై ఐసీసీ తుది నిర్ణయం వచ్చే నెల 25 న తీసుకుంటుంది... వచ్చే ఏడాదికి వాయిదా వేస్తుంది అని సమాచారం. ఇక ఒకవేళ వాయిదా వేస్తే వచ్చే ఏడాది జరిగే టీ 20 ప్రపంచ కప్‌కు హోస్టింగ్ హక్కులు తమకు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.