రోహిత్ ప్రశ్నకు సమాధానం కనిపెట్టిన ఐసీసీ...

రోహిత్ ప్రశ్నకు సమాధానం కనిపెట్టిన ఐసీసీ...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సంగతి అందరికి తెలిసందే. అయితే ఈ వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో అని నిలిచిపోయిన విషయం అందరికి తెలిసందే. అయితే మ్యాచ్ లు లేకపోవడం తో ఐసీసీ పాత మ్యాచ్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది. ఈ రోజు ఐసీసీ చరిత్రలోనే పుల్ షాట్ ఆడే ఉత్తమ ఆటగాడు ఎవరు అంటూ క్రికెట్ అభిమానులను ఓ ఫోటో పోస్ట్ చేస్తూ అడిగింది. ఆ ఫోటో లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ ఉన్నారు. అయితే దీనికి స్పందించిన రోహిత్ ఇక్కడ ఎవరో తప్పిపోయారా ?? ఇంటి నుండి పని చేయడం అంత సులభం కాదు" అని పోస్ట్ చేసాడు. అయితే అది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఆ తప్పిపోయిన వారు ఎవరో ఇప్పుడు కనిపెటింది ఐసీసీ. రోహిత్ ట్విట్ కు స్పందిస్తూ ఐసీసీ ఓ ట్విట్ చేసింది. అందులో... రోహిత్ నిజాయితిగల ఆటగాడు అంటూ తాను ఆడిన పుల్ షాట్ కు సంబంధిన ఓ వీడియోను పోస్ట్ చేసింది ఐసీసీ. అంటే అందులో తప్పిపోయిన వారు ఎవరో కాదు రోహిత్ శర్మనే అని ఐసీసీ ఈ రకంగా చెప్పింది.