ముంబై పోలీసులకు చిక్కిన హైదరాబాదీ

ముంబై పోలీసులకు చిక్కిన హైదరాబాదీ

అక్రమ ఆయుధాలు విక్రయిస్తూ ముంబైలో పోలీసులకు చిక్కాడు హైదరాబాద్ వాసి వహీద్ ఖాన్... హైదరాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన వహీద్ ఖాన్‌ను పాత నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు... ముంబై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాదన్నపేటలోని వహీద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. టెర్రర్ లింక్‌పై ఆరా తీస్తున్నారు. వహీద్‌కు టెర్రర్‌తో సంబంధాలున్నాయన్న ప్రాథమిక ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులతో కలిసి ముంబై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వహీద్‌ నుంచి పలు ఆయుధాలు కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.