టిక్ టాక్ కు పోటీగా హైదరాబాద్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్ రేటింగ్... 

టిక్ టాక్ కు పోటీగా హైదరాబాద్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్ రేటింగ్... 

సోషల్ మాధ్యమాలు, యాప్ ల ద్వారా విలువైన సమాచారాన్ని చైనా తస్కరిస్తోందని చెప్పి ఇండియా 59 రకాల యాప్ లపై నిషేధం విధించింది.  ఇందులో టిక్ టాక్ యాప్ కూడా ఒకటి.  టిక్ టాక్ యాప్ నిషేధం తరువాత ఇండియాలో ఇటువంటి యాప్ చింగారికి డిమాండ్ పెరిగింది.  వేగంగా డౌన్ లోడ్ ల సంఖ్య పెరిగింది.  

అయితే, ఇప్పుడు ఇటువంటి యాప్ మరొకటి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  హైదరాబాద్ కు చెందిన ఎం టచ్ అనే కంపెనీ డబ్ షూట్ అనే యాప్ ను రెడీ చేసింది.  ఈ యాప్ లో సినిమా క్లిప్పింగ్స్ తో పాటు అనేక ఫన్నీ క్లిప్స్ కూడా ఉన్నాయి.  వీటిని ఎడిట్ చేసి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు.  వీటిని వాట్స్ అప్ వంటి వాటిల్లో కూడా షేర్ చేసుకోవచ్చు.  ప్లే స్టోర్ లో ఈ యాప్ కు ఆదరణ లభిస్తోంది.  ప్రతిరోజూ కొన్నివేల షార్ట్ వీడియోలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతామని ఎం టచ్ కంపెనీ చెప్తున్నది.  ఈ యాప్ కు  ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ కూడా రావడం విశేషం.