హైద‌రాబాద్ కూడా డేంజ‌ర్ జోన్‌లో ఉంది.. కేంద్ర‌మంత్రి వార్నింగ్‌

హైద‌రాబాద్ కూడా డేంజ‌ర్ జోన్‌లో ఉంది.. కేంద్ర‌మంత్రి వార్నింగ్‌

తెలంగాణ‌లో క‌రోనా కేసులో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో పాజిటివ్ కేసుల న‌మోదు సంఖ్య‌ను చూస్తేనే వ‌ణుకుపుడుతోంది.. అయితే.. ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా డేంజ‌ర్ జోన్‌లో ఉంద‌ని హెచ్చ‌రించారు కేంద్ర‌మంత్రి జి. కిష‌న్‌రెడ్డి.. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాల‌ని సూచించిన ఆయ‌న‌.. కరోనావైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. తెలంగాణ‌కు పెద్ద ఎత్తున సాయం చేసింద‌న్నారు. రాష్ట్రంలో బెడ్లు లేక కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నార‌నే విష‌యం.. కేంద్ర ప్ర‌భుత్వ దృష్టికి వ‌చ్చింద‌న్న కిష‌న్‌రెడ్డి.. ఓల్డ్ సెక్ర‌టేరియ‌ట్‌లో 3 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చని.. అలాగే. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు. ఇక‌, లాక్‌డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కిష‌న్‌రెడ్డి.