భార్య కాళ్లు, చేతులు నరికి... భర్త కిడ్నాప్

భార్య కాళ్లు, చేతులు నరికి... భర్త కిడ్నాప్

పిఠాపురంలో దారుణం జరిగింది. భార్య కాళ్లు, చేతులు నరికి భర్తను కిడ్నాప్ చేశారు దుండగులు.. అర్థరాత్రి పట్టణంలోని గోపాలబాబ ఆశ్రమం వద్ద నివసిస్తున్న ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మీ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి.. వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం సుబ్బలక్ష్మీ కాళ్లు, చేతులు నరికి, సుబ్రమణ్యంని ఎత్తుకుపోయారు.  అనంతరం మత్తులో ఉన్న సుబ్బలక్ష్మీ స్పృహలోకి రావడం.. నొప్పితో విలవిలలాడుతూ కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి.. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.