ఇటలీలో కరోనా విజృంభణ..ఇప్పటివరకు 100 మంది డాక్టర్లు మృతి..!

ఇటలీలో కరోనా విజృంభణ..ఇప్పటివరకు 100 మంది డాక్టర్లు మృతి..!

ఇటలీలో కరోనా కరోనా విలయ తాండవం చేస్తోంది. చైనాలో పుట్టిన కరోనా అక్కడ తగ్గుముఖం పట్టి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా ముందు ఉండగా కరోనా మృతుల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇటలీలో మొత్తం 17,669 మంది కరోనా తో చనిపోయారు. ప్రస్తుతం రోజూ లక్షల సంఖ్యలో కేసులు వస్తుండగా ప్రతిరోజు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో వైద్యులకు సెఫ్టీ కిట్లు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉండిపోయింది. ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు అక్కడ 100కు పైగా డాక్టర్ లు మరణించడం విషాదకరం. కాగా అక్కడ కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం రిటైడ్ డాక్టర్ లను కూడా రంగంలోకి దింపగా వారు కూడా కొరోనాకు బలైపోయిన సంఘటనలు ఉన్నాయి.