వైరల్:  ఈ చేపను చూసి షాకవుతున్న జనం...  ఎందుకంటే...

వైరల్:  ఈ చేపను చూసి షాకవుతున్న జనం...  ఎందుకంటే...

ఈ విశ్వంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి.  విచిత్రమైన జీవులు ఉన్నాయి.  అందులో కొన్ని  జీవులను చూసి ఆశ్చర్యపోతుంటాం.  అలాంటి వాటిల్లో ఒకటి  ఈ చేప.   మలేషియాకు చెందిన జాలర్లు రోజువారీ చేపల వేటకు వెళ్లినట్టుగానే సముద్రంలోకి వెళ్లారు.  వలేసి చేపలు పట్టారు.  అలా పట్టిన చేపల్లో ఓ చేప వింతగా అనిపించింది.  దానిని చూసిన వెంటనే జాలరులు షాక్ షాక్ అయ్యారు.  

మనిషి ముఖంలో ఉన్నట్టుగా దాని నోరు ఉన్నది.  దంతాలు ఉన్నాయి. వలలో చిక్కిన చేపల్లో అది విచిత్రంగా ఉండటంతో దానిని తీసుకొని దగ్గరలో ఉన్న ఓ పరిశోధన కేంద్రానికి వెళ్లారు.  ఆ చేపను పరిశీలించిన అధికారులు దానిపేరు ట్రిగ్గర్ ఫిష్ అని  చెప్పాడు.  చేప జాతిలో ఇదోరకం చేప అని, చాలా అరుదుగా దొరుకుతుంటాయని అన్నారు.   ఆగ్నేయ ఆసియా సముద్ర జలాల్లో ఈ చేపలు నివసిస్తుంటాయని, మనుషుల పెదవుల మాదిరిగా వీటికి పెద్దవైన పెదవులు ఉంటాయని అన్నారు.  ఈ చేపకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.