మిడ్‌ సెషన్‌: నిఫ్టికి భారీ లాభాలు

మిడ్‌ సెషన్‌: నిఫ్టికి భారీ లాభాలు

ఆర్‌బీఐ పరపతి విధానం ముందు స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయ లాభాలు గడించింది. ఆసియాతో పాటు యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టికి మద్దతు అందింది. నిఫ్టి ప్రస్తుతం 65 పాయింట్ల లాభంతో 10,657 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఇ సెన్సెక్స్‌ కూడా 200 పాయింట్లు లాభపడింది. ఆర్‌బీఐ మరికాస్సేపట్లో పరపతి విధానం  వెల్లడి కానున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌ 3 శాతం లాభ పడి ప్రస్తుతం 293 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్‌, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌, సిప్లాలు ఉన్నాయి.