ప్రభుత్వ బ్యాంకులు.. నష్టాలతో కుదేలు

ప్రభుత్వ బ్యాంకులు.. నష్టాలతో కుదేలు

ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కుంభకోణాలు, అప్పులు, మొండి బకాయిలు.. బ్యాంకులకు పెనుభారంగా మారాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నష్టం అక్షరాలా రూ.87,357కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 ప్రభుత్వం రంగ బ్యాంకులకు గానూ ఇండియన్‌ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ మాత్రమే లాభాలు గడించాయి. మిగతా 19 బ్యాంకులు నష్టాలను నమోదు చేశాయి. నీరవ్‌ మోడీ కుంబకోణంతో నేపథ్యంలో.. నష్టాలు చవిచూసిన బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తొలి స్థానంలో ఉంది. మొత్తం రూ. 12,282.82కోట్ల  నికర నష్టాన్ని ఈ బ్యాంకు నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో రూ.8237.93 కోట్లతో ఐడీబీఐ ఉంది. అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ రూ.6547.45  కోట్ల నష్టాలను చవిచూసింది. ఇక.. ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 1,258.99కోట్లు,  విజయ బ్యాంక్‌ రూ. 727.02కోట్ల లాభాలు గడించాయి.