నేల కొండపల్లిలో కరోనా కలకలం.... ఒక్కరి వల్ల ఎనిమిదిమందికి

నేల కొండపల్లిలో కరోనా కలకలం.... ఒక్కరి వల్ల ఎనిమిదిమందికి

ఖమ్మం జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి లో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది మందికి కరోనా వ్యాపించింది. నేలకొండపల్లిలో 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దుకాణదారుడు అయిన కరోనా రోగి నుంచి మరో 8 మందికి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి నుంచి కుటుంబంలోని ముగ్గురికి కరోనా వ్యాప్తి చెందగా..రోగి దుకాణంలో పనిచేసే మరో ఐదుగురికి కరోనా వైరస్‌ సోకినట్లుగా గుర్తించారు. దాంతో నేల కొండపల్లి ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎంతమందికి ఈ  వైరస్ సోకిందో తెలియక ప్రజలు ఆందోళ పడుతున్నారు. ఇక నెలకొండపల్లిలో భారీగా కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది.పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 14 రోజుల పాటు నేలకొండపల్లిలో పూర్తి లాక్డౌన్ విదించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని , అధికారులు ఆదేశాలిచ్చేవరకూ షాపులూ తెరవకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు.