లాక్ డౌన్ ఎఫెక్ట్: భీభత్సంగా తినేస్తున్నారు... సప్లై చేయలేకపోతున్నారట...!!

లాక్ డౌన్ ఎఫెక్ట్: భీభత్సంగా తినేస్తున్నారు... సప్లై చేయలేకపోతున్నారట...!!

లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు.  లాక్ డౌన్ కు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపిస్తుండటంతో ప్రజలు దాని జోలికి వెళ్ళలేదు.  అదే సమయంలో కోళ్లు కూడా కొన్ని రకాల వ్యాధుల బారిన పడటంతో వేలాదిగా మరణించాయి.  దీంతో పౌల్ట్రీ రంగం పడిపోయింది.  కేజీ రూ.30 ఇస్తామని చెప్పినా తినలేదు. 

కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చికెన్ లో పోషకాలు ఉన్నాయని, ఈ పోషకాలతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే వార్తలు రావడంతో చికెన్ తినడం మొదలుపెట్టారు.  మార్చి నెలాఖరు వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా, ఏప్రిల్ నుంచి అమ్మకాలు పెరిగాయి.  దీంతో పాటుగా ధరలు కూడా పెరిగాయి.  అయితే, ప్రభుత్వం చికెన్, మటన్ ధరలను ఫిక్స్ చేసింది.  అంతకు మించి ఎక్కువ ధరకు అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

2019 వ సంవత్సరంలో దేశవ్యాపంగా 380 కోట్ల టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయి.  అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమ్మకాలు పెరిగిపోవడంతో డిమాండ్ పెరిగింది.  రోజుకు 20 నుంచి 25వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయట.  చికెన్ కు భారీ డిమాండ్ పెరగడంతో దీనికి తగినట్టుగా పౌల్ట్రీ ఫారంలు సరఫరా చేయలేకపోతున్నాయట.  హోటల్స్, రెస్టారెంట్లు మూసేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం విశేషం.