కరోనా వైరస్‌ 12 గంటల్లో చనిపోదా ? మరెందుకు ఈ కర్ఫ్యూ ?

కరోనా వైరస్‌ 12 గంటల్లో చనిపోదా  ? మరెందుకు ఈ కర్ఫ్యూ ?

జనతా కర్ఫ్యూకి దేశమంతా సై అంటోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటానికి 14 గంటలపాటు ఇల్లు దాటబోమని చెప్తున్నారు దేశప్రజలు. ప్రధాని పిలుపు మేరకు దేశమంతా అన్నీ బంద్‌ అయ్యాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, షాపులు, మాల్స్‌,  దాదాపు అన్నీ ఆగిపోయాయి. మన దేశంలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయకపోతే, పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు.. దేశమంతా రైళ్లు ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు నడిపే బస్‌ సర్వీసులకు కూడా బ్రేక్‌ పడింది. ఇప్పటికే పబ్‌ లు, బార్లు, మాల్స్‌  పలు రాష్ట్రాలు ఆపేశాయి. గల్లీ షాపుల నుంచి హోల్‌ సేల్‌ మార్కెట్‌ ల వరకు మూతపడ్డాయి. 

జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి? 

జనతా కర్ఫ్యూ 14 గంటల వరకూ ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉండటం వల్ల వైరస్ విచ్ఛిన్నం అవుతుంది.. మరింత గొలుసు కట్టుగా వ్యాపించే అవకాశం ఆగిపోతుంది. తద్వారా కరోనా వైరస్ చచ్చిపోతుంది. ఈ 14 గంటల తర్వాత ఫలితం సురక్షిత దేశం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. జనతా కర్ఫ్యూ వెనుక ఉన్న భారత ప్రభుత్వ ఆలోచన అది. అయితే దీనిపై సైంటిస్టులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. నిజానికి జనతా కర్ఫ్యూపై ప్రధాని మోదీ చేసిన జనతా కర్ఫ్యూ ఆలోచన చాలా మంచిది. కానీ వైరస్ మనుగడ కేవలం 12 గంటల మాత్రమే అని వస్తున్న వార్తలు నిజం కాదని అంటున్నారు. కరోనా వైరస్ ఏఏ వస్తువు మీద ఎంత సేపు యాక్టివ్ గా ఉంటాయన్న విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ప్రిన్సటన్ వర్శిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షెన్ డిసీజెస్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (హామిల్టన్‌), సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తదితర సంస్థల శాస్త్రజ్ఞుల అధ్యయనం చేవారు. 

వారి లెక్కల ప్రకారం 
రాగి మీద 4 గంటలు, 
అట్టపెట్టెలపై 24 గంటలు,
ప్లాస్టిక్‌, స్టెయిన్‌లెస్ స్టీల్‌ వస్తువులపై 2 నుంచి 3 రోజులపాటు, 
అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల దాకా బతకగలదని తేల్చారు.

వైరస్‌ యాక్టివ్ గా అంటే బ్రతికి ఉన్న సమయంలో సదరు వస్తువును చేతితో తాకి, అదే చేతితో ముక్కు లేదా నోటిని తుడుచుకుంటే కరోనా ఎటాక్‌ అవుతుంది. గాలిలో కంటే వస్తువుల ఉపరితలంపైనే కరోనా వైరస్‌ కణాలు ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. అంటే గాలిని పీల్చడం ద్వారా కంటే, అపరిశుభ్ర పరిసరాలను తాకిన చేతుల ద్వారా వైరస్‌ సంక్రిమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వైద్యులు.. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముఖంపై తాకడం, ఏదైనా తినడం చేయవద్దని సూచిస్తున్నారు. కరోనా కట్టడికి చేతి శుభ్రత చాలా ముఖ్యమని చెబుతున్నారు.

 ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌ బారినపడకుండా ఉండాలంటే మనమంతా స్వీయ శుభ్రత పాటించాలి...మోడీ చెప్పారనో కేసీఆర్ చెప్పారనో కాకుండా మన ప్రాణాల కోసం మన దేశంలోని వారి కోసం నడుం బిగిద్దాం మనం శుభ్రంగ ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కరోనా మహమ్మారిని కట్టడి చేద్దాం.