తన 6 సిక్సర్లకు ముందు ఫ్లింటాఫ్ ఏం అన్నాడో చెప్పిన యువరాజ్...

తన 6 సిక్సర్లకు ముందు ఫ్లింటాఫ్ ఏం అన్నాడో చెప్పిన యువరాజ్...

2007 సెప్టెంబర్ 19 టీ 20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ సందర్భంగా, భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టాడు. అయితే ఆ రోజును గుర్తుచేసుకుంటూ యువరాజ్ సింగ్ అంతక ముందు ఓవర్లో ఏమి జరిగిందో వెల్లడించాడు. భారతీయ ఆల్ రౌండర్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో తనకు వాదన ఉందని, స్టువర్ట్ బ్రాడ్ తరువాతి ఓవర్లో తన దాడిని భరించాల్సి ఉందని చెప్పాడు. నిజం చెప్పాలంటే 6 సిక్సర్లు కొట్టాలని నా మనసులో లేదు. కాని నా వాదన అలాగే ఫ్లింటాఫ్ నన్ను రెచ్చగొట్టారు" అని యువరాజ్ అన్నారు. నేను ఫ్లింటాఫ్‌ డెలివరీల్లో 2 బౌండరీలు కొట్టాను, అది అతనికి నచ్చలేదు. అయితే ఆ తర్వాత నేను మరొక చివరకి నడుస్తున్నప్పుడు. అతను చెప్పిన అని నేను మీకు చెప్పలేను కానీ నావి హాస్యాస్పదమైన షాట్లు అని అతను నాకు చెప్పాడు . అందువల్ల నేను గొడవ పడ్డాను" అని యువీ తెలిపాడు.

అప్పుడు అక్కడ  ఫ్లింటాఫ్ నాతో  "నేను మీ గొంతు కోస్తాను" అని అన్నాడు. వెంటనే నిన్ను "నా చేతిలో ఈ బ్యాట్ చూశావా. ఈ బ్యాట్‌తో నేను నిన్ను ఎక్కడ కొట్టబోతున్నానో నీకు తెలుసా?" అని సమాధానం ఇచ్చాను. కాబట్టి వెంటనే అంపైర్ మాకు అంతరాయం కలిగించాడు, కాని ఆ వాదన తర్వాత నాకు చాల కోపం వచ్చింది మరియు నేను అప్పుడు ప్రతి బంతిని గ్రౌండ్ నుండి బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తూ ఇది నా రోజు" అని యువరాజ్ గుర్తు చేసుకున్నారు. అయితే "ఈ రోజు నేను ఆ సిక్సర్లను చూసినప్పుడు, నేను అలా ఎలా కొట్టాను అని నేను ఆశ్చర్యపోతున్నాను" అని చెప్పాడు యువరాజ్.