కరోనా వైరస్ వ్యాప్తిపై మరో కథనం... ఇదైనా నిజమా కాదా?

కరోనా వైరస్ వ్యాప్తిపై మరో కథనం... ఇదైనా నిజమా కాదా?

కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్నది.  కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపుగా 13,49,584మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.  74,808 మంది వైరస్ వలన మరణించారు.  చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.  అయితే, కరోనా వైరస్ వ్యాపించడం వెనుక అనేక కథనాలు బయటకు వస్తున్నాయి.  

గబ్బిలాల పేగుల్లో కరోనా వైరస్ అధికంగా ఉంటుంది.  ఆ వైరస్ గబ్బిలాల మల మూత్రాల ద్వారా బయటకు వస్తుంది. గబ్బిలాల మల మూత్రాలను గ్వానో అని పిలుస్తారు.  ఇది గబ్బిలాలు నివసించే గుహల్లో ఉంటుంది.  ఈ గ్వానోను రైతులు పంటలకు ఎరువులుగా ఉపయోగిస్తారట. ఇలా గ్వానో ఎరువులను ముట్టుకున్న సమయంలో అందులోని వైరస్ రైతుకు వ్యాపించింది.  అక్కడి నుంచి వుహాన్ మార్కెట్ కు అక్కడి నుంచి ప్రజలకు వ్యాపించినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి.  ఈ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియడం లేదు. ఇదే కాదు, 2003లో వచ్చిన సార్స్ వైరస్ సైతం ఎలా వచ్చిందో ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.  అయితే, మరికొన్ని కథనాల ప్రకారం చైనా బయోవైరస్ ను ల్యాబ్ లో సృష్టించిందని, అది అక్కడి నుంచి పక్కనే ఉన్న వుహాన్ మార్కెట్ ద్వారా ఇతరులకు వ్యాపించినట్టు కొంతమంది చెప్తున్నారు.