నోబెల్‌‌కు ట్రంప్ పేరు..!

నోబెల్‌‌కు ట్రంప్ పేరు..!

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేట్ అయ్యింది. ఆయన పార్టీకి చెందిన నేతలు ఈ ప్రతిపాదననునోబెల్ కమిటీకి పంపించారు. ట్రంప్‌కు నోబెల్ రావొచ్చంటూ గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో ట్రంప్ సమావేశమయ్యారు.. ఆ చర్చలు ఫలించి తమ అణ్వాయుధారాన్ని మూసివేస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాలుగా అర్హులని చెప్పారు. మొన్నామధ్య మిచిగాన్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ను ఆయన అభిమానులు "నోబెల్ నోబెల్ "అంటూ నినాదాలు చేయడంతో.. "ఆయన నా కర్తవ్యం నేను నిర్వహించాను" అన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పేరును నోబెల్‌కు సిఫారసు చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన లూక్ మెస్సర్ నార్వేలోని నొబెల్ కమిటీకి లేఖ రాశారు. ఉత్తర కొరియాతో అణుయుద్ధాన్ని నివారించారని.. ఆయన ఆంక్షల బెదిరింపులు, యుద్ధభయంతో ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ దిశగా అడుగులు వేస్తోందని. దక్షిణ కొరియాతో సామరస్య ధోరణితో వ్యవహరిస్తోందని.. కొరియా యుద్ధాన్ని నివారించి ప్రపంచాన్ని యుద్ధభయం నుంచి కాపాడిన ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై రిపబ్లికన్ పార్టీకి చెందిన 17మంది సభ్యులు సంతకాలు చేయడం విశేషం.