యాక్టివాకు డబుల్ పవర్

యాక్టివాకు డబుల్ పవర్

మనందరికీ ఇప్పటి వరకు హోండా యాక్టివా తెలుసు. అందులో హోండా 3జీ, 4జీ కూడా తెలుసు. ఇప్పుడు హోండా మరో కొత్త స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. హోండా ఫోర్జా 125 పేరుతో  కొత్త తరం టూవీలర్ ను  ఆవిష్కరించనుంది. ఇది దాదాపు హోండా యాక్టివా కు  డబుల్ పవర్ కలిగి ఉంటుందని  కంపెనీ చెబుతోంది. హోండా ఫోర్జాకు 125 సీసీ కెపాసిటీ ఇంజిన్ అమర్చారు. ఇది యూరప్ లో చాలా పాపులర్. 2015లో సుమారు 30వేల స్కూటర్లు విక్రయించారు. 

ఇప్పుడు హోండా ఫోర్జాను మరికొన్ని హంగులతో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఇంజిన్, చాసెస్ లో ఎలాంటి మార్పులు లేవు. కేవలం డిజైన్ , ఎలక్ట్రానిక్ డివైజ్ లలో మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. ఒకసారి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే 486 కి.మీ. ప్రయాణించ వచ్చని హోండా కంపెనీ చెబుతోంది.  కొత్త ఫోర్జాలో అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్ , ఎల్ ఈ డీ ఇండికేటర్స్ , క్లస్టర్, అనలాగ్ స్పీడో మీటర్  అదనంగా ఉంటాయి. హ్యాండిల్ బార్ ను అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది.