అందుకే మద్యం దుకాణాలు తగ్గింపు.. మహిళలు సంతోషంగా ఉన్నారు..!

అందుకే మద్యం దుకాణాలు తగ్గింపు.. మహిళలు సంతోషంగా ఉన్నారు..!

లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం షాపులను తెరుస్తూనే.. మందుబాబులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం... మొదట 25 శాతం.. మరుసటి రోజు 50.. ఇలా మద్యంపై వడ్డించి మొత్తం రెండురోజుల వ్యవధిలో మద్యం ధరలను 75 శాతం పెంచింది. అయితే, దీనిపై విమర్శలు కూడా లేకపోలేదు.. అయితే, క్రమంగా మద్యపాన నిషేధంలో భాగంగానే ఈ ధరలను పెంచినట్టు ఇప్పటికే అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు.. మద్యంషాపులను కూడా తగ్గించి ఏపీ సర్కార్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత... దశాలవారి మద్యం నియంత్రణలో భాగంగానే మద్యం దుకాణాలు తగ్గించినట్టు వెల్లడించారు.. ప్రభుత్వ చర్యలపై మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారామె. 

ఇక, కరోనా నివారణ చర్యల్లో కూడా ఏపీ ప్రభుత్వం ముందుందన్నారు మేకతోటి సుచరిత.. మరోవైపు విశాఖ ఎల్డీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం చర్యలు బాగున్నాయన్న ఆమె.. అయినా ప్రతిపక్షాలు సీఎం వైఎస్ జగన్‌పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్డీ పాలిమర్స్ ఫ్యాక్టరీ తరలింపుకు కూడా చర్యలు ఉంటాయన్నారు. లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు ఉన్నమాట వాస్తమేనన్నారు హోంమంత్రి.. అయితే, ఇష్టానుసారంగా తరలిస్తే ..ఇన్నాళ్లు లాక్ డౌన్‌తో పడ్డ శ్రమ వృధా అవుతుందన్న ఆమె.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.