పెరుగుతోన్న క‌రోనా కేసులు.. హోం ఐసోలేషన్​కు కొత్త రూల్స్‌

పెరుగుతోన్న క‌రోనా కేసులు.. హోం ఐసోలేషన్​కు కొత్త రూల్స్‌

క‌రోనా కేసుల విజృంభ‌న కొన‌సాగుతోంది.. మొద‌ట్లో అనుమానితుల‌ను సైతం ప్ర‌భుత్వం క్వారంటైన్‌లో పెట్టింది.. ఆ త‌ర్వాత‌..  క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్లు ఎక్కువ కావ‌డంతో.. హోం క్వారంటైన్‌ల‌ను సైతం పెట్టారు.. ఇక‌, క‌రోనా సోకిందంటే.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ వార్డుకు వెళ్లాల్సిందే.. కేసులు పెరుగుతోన్న స‌మ‌యంలో ఇది కాస్తా.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు విస్త‌రించింది.. అంతేకాదు.. అవ‌కాశం ఉన్న‌వాళ్లు హోం ఐసోలేష‌న్‌లో కూడా ఉండ‌వ‌చ్చు అని కొత్త రూల్స్ తెచ్చారు.. మొద‌ట వైద్యుల‌ను సంప్ర‌దించి.. వారు సూచించిన మందుల‌ను తీసుకుంటూ.. అనుమానం ఉంటే వైద్యుల‌ను ఫోన్ ద్వారా సంప్ర‌దిస్తూ.. మంచి ఆహారం తీసుకొని.. బాగా రెస్ట్ తీసుకుంటూ.. శుభ్ర‌త‌ను టింపాచాల్సి ఉంటుంది. హోం ఐసోలేష‌న్‌కు సంబంధించి రూల్స్ ఇప్ప‌టికే ఉన్నా.. మ‌ళ్లీ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది కేంద్రం..  

హోం ఐసోలేష‌న్ కొత్త రూల్స్:
* రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పేషెంట్లు హోం ఐసోలేషన్​కు అన‌ర్హులు.
* 60 ఏళ్లు పైబడిన రోగులు, రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధ‌ప‌డేవారు వైద్యులు అనుమ‌తిస్తేనే హోం ఐసోలేషన్​లో ఉండాలి.
* హోం ఐసోలేషన్ స‌మ‌యం కుదింపు.. కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదు. ఏడు రోజుల వరకు పేషెంట్ తన ఆరోగ్య పరిస్థితిని సెల్ఫ్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
* హోం ఐసోలేషన్ పిరియడ్ అయిపోయిన తర్వాత టెస్టులు చేయాల్సిన అవసరం లేదు.
* వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్ పేషెంట్లు హోం ఐసోలేషన్​లో ఉండాలంటే ఉండొచ్చు. కానీ, సెల్ఫ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కచ్చితంగా ఉండాలి. 24×7 ప్రాతిపదికన పేషెంట్​ను చూసుకునేందుకు ఒక‌రు అందుబాటులో ఉండాలి. 
* కేర్ గివర్, పేషెంట్ క్లోజ్ కాంటాక్ట్స్.. డాక్టర్ల సూచన మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసుకోవాలి.
* ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో అది ఆన్​లోనే ఉండేలా చూసుకోవాలి.
* పేషెంట్లు రెగ్యులర్​గా తమ హెల్త్​ను మానిటర్ చేసుకోవాలి.. జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్​కు తమ హెల్త్ స్టేటస్​ గురించి రెగ్యుల‌ర్‌గా స‌మాచారం ఇవ్వాలి.
* ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్​లో సీరియస్ సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ ఉండేలా చూసుకోవాలి. 
* హోం ఐసోలేషన్​లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఫీల్డ్ స్టాఫ్/నిఘా బృందాలు వ్యక్తిగతంగా వెళ్లి తెలుసుకోవాలి. ప్రత్యేక కాల్ సెంటర్‌ ద్వారా రోగుల మెడికల్ కండిషన్​పై ఫాలో అప్ చేస్తూ ఉండాలి.
* ప్రతి పేషెంట్ క్లినికల్ స్టేటస్​ను ఫీల్డ్ స్టాఫ్ లేదా, కాల్ సెంటర్ ద్వారా రికార్డు చేయాలి.