టోల్‌ ఫీజు భారీగా పెంపు...ఆ రూట్లో ఇక బాదుడే!

టోల్‌ ఫీజు భారీగా పెంపు...ఆ రూట్లో ఇక బాదుడే!

వాహనదారులకు టోల్‌ గేట్‌ యజమాన్యం షాక్‌ ఇచ్చింది ప్రభుత్వం...ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ముఖ్యంగా...రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెంచినట్లు తెలిపింది..పెంచిన ధరలను రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు... హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది..
పెరిగిన టోల్‌గేట్‌ ఫీజుల వివరాలు.. కారు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 58, ఒక రోజు పాస్‌ రూ. 87, నెల పాస్‌ రూ. 1,740.
ఎల్‌సీవీ/మినీ బస్సు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 117, ఒక రోజు పాస్‌ రూ. 175, నెల పాస్‌ రూ. 3,510.
బస్సు/ట్రక్కు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 233, ఒక రోజు పాస్‌ రూ. 349, నెల పాస్‌ రూ. 6,990.
ఎంఏవీ : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 583, ఒక రోజు పాస్‌ రూ. 874, నెల పాస్‌ రూ. 17,490.