చైనాలో మరో డేంజర్ వైరస్..స్వైన్‌ ఫ్లూ కంటే ప్రమాదకరం ..!

చైనాలో మరో డేంజర్ వైరస్..స్వైన్‌ ఫ్లూ కంటే ప్రమాదకరం ..!

ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచం వణికిపోతుంది. నెలలు గడుస్తున్నా లక్షల్లో కేసులు నమోదవుతున్నా వ్యాక్సిన్ ను కనిపెట్టలేక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ గతంలో వచ్చిన స్వైన్ ప్లూ వైరస్ కంటే డేంజర్ అని చెబుతున్నారు. చైనాలో కనిపించే కొత్త వైరస్ స్వైన్ ఫ్లూ ప్రాణాంతక వైరస్ లాంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది "మానవులకు సోకడానికి అత్యంత అనుకూలంగా ఉండటానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని "  చైనీస్ విశ్వవిద్యాలయ మరియు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు 2011 నుంచి 2018 వరకు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆస్పత్రులు, పందుల కళేబరాలతో నుండి 30,000 వేల స్వాబ్స్‌ను సేకరించి పరిశోధనలు జరిపారు. దాదాపు 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్‌ చేసినట్లు తెలిపారు. ఈ వైరస్ ను G4 గా గుర్తించారు. 179 రకాల ప్లూ వైరస్ లలో G4 కొత్తరకమని, 2016 నుంచి పందులలో ఎక్కువగా కనిపించిందని వెల్లడించారు. G4 అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా గుర్తించబడిందని, మరియు ఇతర వైరస్ ల కంటే  మరింత తీవ్రమైన లక్షణాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మానవులకు సైతం సోకుతుందని, సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదన్నారు. అంతేకాకుండా చైనా జనాభాలో 4.4 శాతం మందికి ఇప్పటికే ఈ వైరస్ సోకిందని తెలిపారు. వైరస్ ఇప్పటికే జంతువుల నుంచి మానవులకు చేరిందని, కాని ఇది మానవుడి నుంచి ఇతర మానవులకు చేరగలదనే దానిపై ఇంకా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు.