ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత

ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత

ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, కృష్ణా జిల్లా తిరువూరు వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. ..తెలంగాణా నుండి వచ్చే ప్రతి వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. తమకు ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసినా వినడం లేదంటున్నారు అక్కడ ఉన్న వాహనాదారులు. పోలీసులు అనుమతించక పోవడంతో చెక్ పోస్ట్ ల వద్ద భారీగా నిలిచిపోయాయి వాహనాలు. ఏపీలో అడుగు పెట్టాలంటే 14 రోజులు క్వారెంటైన్ కి వెళ్ళాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని చెబుతున్నా ఎవరూ వినని పరిస్థితి అక్కడ నెలకొంది. మరి ఈ విషయంలో ప్రభుత్వాలు సరయిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.