హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టు షాక్‌

హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టు షాక్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్ట్‌ షాక్‌ ఇచ్చింది. తక్షణమే ఆ పదవి నుంచి తొలగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ నిలిపివేసింది. అంబుడ్స్‌మన్‌ తీర్పు సరైనదేనని స్పష్టం చేసింది. మరో సారి పూర్తి విచారణ చేపట్టాలని, అప్పటి వరకు హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగవద్దని డివిజన్‌ బెంచ్‌ వివరించింది.