8 లక్షల రేషన్ కార్డుల రద్దు.. హైకోర్టు సీరియస్...!

8 లక్షల రేషన్ కార్డుల రద్దు.. హైకోర్టు సీరియస్...!

లాక్‌డౌన్ వేళ రేషన్ కార్డులు రద్దు చేశారన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రేషన్ కార్డులు లేని పేదలకు బయోమెట్రిక్ లేకుండా ఉచిత బియ్యం ఇవ్వాలని ఆదేశించింది. వలస కార్మికులకు ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలంది. రేషన్‌తో సంబంధం లేకుండా తెల్లకార్డున్న వారందరికీ రూ.15 వందలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మూడు నెలలుగా రేషన్ తీసుకోలేదన్న కారణంగా కొందరికీ 15వందలు ఇవ్వలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రేషన్ కార్డు లేదని 15వందలు నిలిపివేసే ముందు లాక్‌డౌన్‌లో పేదల పరిస్థితి ఆలోచించాల్సిందని ప్రభుత్వానికి చురకలంటించింది.  కనీసం నోటీసు ఇవ్వకుండా 8లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు.