తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సపంత్‌ కుమార్ శాసనసభ సభ్యత్వ రద్దుపై  హైకోర్టులో విచారణ జరగగా... ఈ రోజు కౌంటర్ ధాఖలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం రోజు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది  హైకోర్టు... తదుపరి విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సోమవారం నుంచి వాదనలు వింటామన్న హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయలేకపోతే ఈ కేసులో ఇక కౌంటర్ ఉండదని భావించాల్సి ఉంటుందని పేర్కొంది.