ప్రవేశ పరీక్షల వాయిదా పై హైకోర్టు విచారణ...

ప్రవేశ పరీక్షల వాయిదా పై హైకోర్టు విచారణ...

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మొదటి లాక్ డౌన్ లోనే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన తరవాత జులై 1 నుండి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాము అని తెలిపారు అధికారులు. అయితే రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న పిల్ పై హైకోర్టు విచారణ జరుపుతుంది. హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టె అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని ఆరా తీసిన హైకోర్టు.. ఒకవేళ హైదరాబాద్ లో లాక్ డౌన్ ఉంటే పరీక్షలు ఎలా నిర్వహించగలుగుతారు అని ప్రశ్నించింది. అందువల్ల హైదరాబాద్ లో లాక్ డౌన్ అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు  ఏజీని ఆదేశించింది.