'హైదరాబాద్‌'కు హైబీపీ

'హైదరాబాద్‌'కు హైబీపీ

హైదరాబాదీల్లో 'హైబీపీ' పెరిగిపోతోంది. ఇప్పటివరకు మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో ముందున్న తెలంగాణలో  హైబీపీ రోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 'జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే' ప్రకారం తెలంగాణలో మహిళల్లో కంటే పురుషుల్లోనే అధిక రక్తపోటు బాధితులు ఎక్కువమంది ఉన్నారు. రాష్ట్రంలో 12.2 శాతం మంది పురుషులు, 7.4 శాతం మంది మహిళలు అధిక రక్తపోటు బాధితులని తేలింది. అత్యధిక రక్తపోటు బాధితులున్న జిల్లాగా హైదరాబాద్‌ను గుర్తించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లోనూ రక్తపోటు బాధితులు అధికంగా ఉన్నారు. ఇక..  దేశంలో 14 కోట్ల మంది ప్రజలు హైబీపీతో బాధపడుతున్నారని, 2018 నాటికి వీరి సంఖ్య 21.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. గుండె, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదమున్నందున రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.