పవన్ కళ్యాణ్ సినిమాలో వెంకటేష్ హీరోయిన్...

పవన్ కళ్యాణ్ సినిమాలో వెంకటేష్ హీరోయిన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం అనే విషయం అందరికి తెలుసు. అందులో ఒక పాత్రలో నివేద థామస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో పాత్రలో హీరోయిన్ అంజలి  నటించబోతుంది అంటున్నారు. అయితే ఈ మధ్య వకీల్ సాబ్ సిసినిమా నుండి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ అయ్యింది, అందులో పవన్ వెనుక ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ అమ్మాయి హీరోయిన్ అంజలి అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ మరో రెండు సినిమాలను  కూడా ఇప్పటికే అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలు అన్ని ఎప్పుడు విడుదల అవుతాయా అని పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.