సేవాగుణాన్ని చాటుకున్న యంగ్ హీరో ..

సేవాగుణాన్ని చాటుకున్న యంగ్ హీరో ..

మ‌హామ్మారి కరోనాపై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం నెమ్మదిగా మరణాల సంఖ్య పెరుగుతుండడం పెను కంపనాలు పుట్టిస్తోంది. ఈ పర్యవసానం పేదల ఆకలి కేకల్ని బయట పెడుతోంది. ఇక అలంటి వారికోసం టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. తమ వంతుగా చేయగలిగిన సాయాన్ని చేస్తున్నారు. కొందరు ఆర్ధిక సాయం చేస్తుంటే మరికొందరు  నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ముందుకొచ్చాడు. ప్రజలకు మాస్కులు పంచి పెడుతూ సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు. తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ మాస్కులు - శానిటైజర్స్ పంచి పెడుతూ వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా అందరూ తమకు సాధ్యమైన స్థాయిలో పేదవారికి సహాయం చేయమని పిలుపునిస్తున్నారు.