చైనాకు షాకిచ్చిన హీరో సైకిల్స్.. సంచ‌ల‌న నిర్ణ‌యం

చైనాకు షాకిచ్చిన హీరో సైకిల్స్.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తాజాగా, భార‌త్ - చైనా మ‌ధ్య నెల‌కొన్ని ఉద్రిక్త ప‌రిస్థితులు... డ్రాగ‌న్ కంట్రీకి షాకిస్తున్నాయి.. చైనా వ‌స్తువులు బ‌హిష్క‌రించాలంటూ ఓ వైపు సోష‌ల్ మీడియాలో ఉద్య‌మం న‌డుస్తోంది.. మ‌రికొంద‌రు చైనా వ‌స్తువుల‌ను కొన‌డ‌మే మానేశారు.. మ‌రోవైపు.. చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించింది భార‌త ప్ర‌భుత్వం.. ఇదే స‌మ‌యంలో.. చైనాకు భారీ షాక్ ఇచ్చింది  హీరో సైకిల్స్.. చైనాతో కుదుర్చుకున్న రూ. 900 కోట్ల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్న‌ట్టు హీరో సైకిల్స్ సంస్థ‌ చైర్మన్ పంకజ్ ముంజల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. గ‌తంలో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. 3 నెల‌ల్లో చైనాతో  రూ.900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉండ‌గా.. ఆ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.. అంతేకాదు.. చైనా వస్తువుల బహిష్కరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనంగా చెప్పుకొచ్చారు.. చైనాతో ఒప్పందాలు ర‌ద్దుచేసుకుని.. కొత్త మార్కెట్ల కోసం ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. హీరో సైకిల్స్ స్వావలంబన వైపు ప‌య‌నిస్తోంది.. మేం.. భార‌త్‌లో 72 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న హీరో ఎలక్ట్రో ఇ-సైకిల్‌ను ప్రారంభిస్తున్నామ‌ని వెల్ల‌డించారు పంజ‌క్ ముంజ‌ల్.