91% క్షీణించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

91% క్షీణించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

కంపెనీ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ కారణంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికర లాభం భారీగా తగ్గింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌(ఏకీకృత ప్రాతిపదికన) నికర లాభం రూ.19.86 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. చివరి త్రైమాసికంలో పలు కార్యకలాపాలను ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ఫలితాలను పాత ఫలితాలతో పోల్చలేమని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ  నికర లాభం రూ.223.43 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 91 శాతం క్షీణించింది. ఇదే కాలానికి మొత్తం ఆదాయం మాత్రం రూ.742.79 కోట్ల నుంచి రూ.614.12 కోట్లకు మాత్రమే తగ్గింది. 2017-18కి ఆదాయం రూ.2,776.46 కోట్లుగా నమోదు కాగా.. నికర లాభం రూ.62.73 కోట్లుంది. అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.2,146 కోట్లు. నికర లాభం రూ.277.76 కోట్లుంది. అంటే గత ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 77 శాతం క్షీణించింది. మార్చితో ముగిసిన ఏడాదికి రూ.5 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.2(40%) డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.