అందం ఉన్న అవకాశాలు మాత్రం ఆమడదూరం

అందం ఉన్న అవకాశాలు మాత్రం ఆమడదూరం

అందం ఉన్న అవకాశాలు ఒక్కొక్కసారి  దక్కవు దీనికి ఉదాహరణగా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళు ఉన్నారు , కొంతమంది ఐటెం సాంగ్స్ కు పరిమితమైన వాళ్ళు ఉన్నారు. తాజాగా ఓ భామ పరిస్థితి కూడా అలానే ఉంది. అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందనంత దూరం లో ఉంటున్నాయి. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు హెబ్బా పటేల్ . సుకుమార్ సమర్పణలో తెరకెక్కిన కుమారి 21 సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ చిన్నది ఆ తరవాత వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఆఫర్లు కరువయ్యాయి. 

దాంతో ఏకంగా అమ్మడు ఐటెం సాంగ్స్ లో ఆడిపాడటానికి కూడా రెడీ అయ్యింది. ఇటివలే ‘భీష్మ’లో గెస్ట్ రోల్ చేసింది. ఇక రాజ్ తరుణ్ సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’లో కూడా గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ ప్లే చేసింది. తాజాగా రామ్ నటిస్తున్న రెడ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది హెబ్బా. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ పిక్ షేర్ చేసింది. ఆ ఫొటోలో బొద్దుగా ఉండే హెబ్బా కాస్త సన్నబడినట్లు కన్పిస్తుంది.ఇక సినిమా అవకాశాలు లేకపోయినా వెబ్ సిరీస్ లో ఛాన్స్ లు దక్కించుకుంటుంది. తాజాగా ఓ అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిందట.