విజయవాడలో భారీ వర్షం

విజయవాడలో భారీ వర్షం

విజయవాడలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. అరగంటపాటు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమవ్వగా.. ఈదురుగాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో కరెంట్ తీగలు తెగిపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షపు నీరు నిలబడటంతో ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత కొద్దిరోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం రాకతో కాస్తంత సేద తీరారు.