గోదావరి పరవళ్లు...

గోదావరి పరవళ్లు...

నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో బాబ్లీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. బాబ్లీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువకు 98,873 క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదికి వదిలారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి పరుగులు పెడుతుంది. ఈ నీరు దిగువన ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి ఈ రోజు భారీ స్థాయిలో వచ్చి చేరుతుంది.