తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..50 డిగ్రీలకు పెరిగే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..50 డిగ్రీలకు పెరిగే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు...రోజు రోజుకూ ఎండలు విపరితంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు...అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు... వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ దారుణంగా మారింది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. హైదరాబాద్‌లోనూ భానుడి విశ్వరూపానికి జనం బెంబేలెత్తుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 5 నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి.

పొద్దున తొమ్మిది గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం ఆరు గంటల వరకూ అలాగే ఉంటోంది. అర్ధరాత్రి వరకు కూడా గాలి వేడిగా ఉంటోంది. ఉక్కపోత పెరిగిపోవడంతో జనం ఇబ్బందిపడుతున్నారు. మున్ముందు మరింతగా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు..రాష్ట్రంలో వాతావరణం క్షణం క్షణం మారుతుంది..ఇకవైపు ఎండలు మాడును పగలగొడుతుంటే మరోవైపు అకాల వర్షాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు....అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో ఓ మోస్తరు వానలు పడే చాన్స్​ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత పెరగవచ్చని ప్రకటించారు... 45 డిగ్రీల టెంపరేచర్లు దాటి నమోదవుతాయని వెల్లడించారు.