తెలంగాణలో విద్యార్థినిలకు హెల్త్ కిట్లు

తెలంగాణలో విద్యార్థినిలకు హెల్త్ కిట్లు

విద్యార్థినిల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న సుమారు 8 లక్షల మందికి హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను అందజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రూ. 400 విలువైన ఒక్కో కిట్‌లో సుమారు 16 వస్తువులు ఉంటాయని.. ఈ కిట్‌ను మూడు నెలలకోసారి చొప్పున ఏడాదికి నాలుగు సార్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఇందు కోసం రూ.85 కోట్లను ఖర్చు పెడుతున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఈ పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. 

కిట్‌లో ఏం ఉంటాయంటే..
4 స్టేఫ్రీ నాప్‌కిన్లు, రెండు టూత్ పేస్టులు, టూత్ బ్రష్‌లు, టంగ్ క్లీనర్, బొట్టు బిళ్లల ప్యాకెట్, కొబ్బరి నూనె, పౌడర్, షాంపూ, 2 బట్టల సబ్బులు, మూడు స్నానపు సబ్బులు, దువ్వెన, హ్యా్ండ్ వాష్ క్లీనర్, లిప్‌బామ్, అద్దం, జడ క్లిప్పులు, జడ రబ్బర్లు.