వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ఆర్‌బీఐ రెపో రేట్‌ పెంచిన ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపై కన్పిస్తోంది. ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ వడ్డీ రేట్లను పెంచింది. తాను అందించే రుణాలపై వడ్డీ రేటును పది బేసిస్‌ పాయింట్లు(0.10 శాతం) పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ వంటి ఇతర బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు పీఎన్‌బీ వంటి కొన్ని బ్యాంకులు ఈ నెల 1 నుంచే వడ్డీని పెంచాయి. డిపాజిట్లపై ఇదివరకే వడ్డీ రేట్లను పెంచామని, దీంతో రుణాలపై వడ్డీ రేటు పెంచక తప్పడం లేదని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి.