కొడుకును ప్రపంచానికి చూపించిన పాండ్యా... 

కొడుకును ప్రపంచానికి చూపించిన పాండ్యా... 

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు జూనియర్ పాండ్యా ఈ ప్రపంచం లోకి వచ్చి రెండు రోజులు అవుతుంది. అయితే తనకు కొడుకు పుట్టాడు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పాండ్యా కేవలం తన చేతిని పట్టుకున్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేసాడు. కానీ అతని కొడుకు ముఖాన్ని చూపించలేదు. ఇక తాజాగా ఈ రోజు పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో  పోస్ట్ చేసాడు. అందులో జూనియర్ పాండ్యాను ఎత్తుకొని చూస్తూ కనిపిస్తున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి కాకముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక పాండ్యా తన తండ్రి బాధ్యతలు చెప్పటి కొత్తగా పుట్టిన బిడ్డ కోసం ''బేబీ డైపర్స్'' తీసుకెళ్తున్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలిపాడు.