తండ్రి బాధ్యతలు చేపట్టిన పాండ్యా... కొడుకు కోసం అవి తీసుకెళ్తు...

తండ్రి బాధ్యతలు చేపట్టిన పాండ్యా... కొడుకు కోసం అవి తీసుకెళ్తు...

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిన్న తండ్రి అయ్యాడు. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ పండంటి మగబిడ్డకు జన్మనిచింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అయితే ఈ రోజునుండి పాండ్యా తన తండ్రి బాధ్యతలు చెప్పటాడు. కొత్తగా పుట్టిన బిడ్డ కోసం షాపింగ్‌ చేసిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దానిని తన భాగస్వామి నటాసా ‌ను ట్యాగ్ చేస్తూ, హార్దిక్ ఇలా వ్రాశాడు. ''బేబీ డైపర్స్  దారిలో ఉన్నాయి". అయితే ఆ ఫొటోలో హార్దిక్ డ్రైవర్ సీట్లో ఉండగా ఆ వెనుక బేబీ డైపర్లు కనిపిస్తున్నాయి. అయితే తన నిశ్చితార్థం నుండి ఇప్పటి వరకు, హార్దిక్ తన వ్యక్తిగత వార్తలను తన అభిమానులతో  సోషల్ మీడియా లో పంచుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరి 1 న హార్దిక్ తన ఎంగేజ్‌మెంట్ ఆ తర్వాత మే లో తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పాడు.